Friday, January 28, 2005

ఏటీ జన్మమిది హా ఓ రామ

రాగం: వరాళి
తాళం: చాపు


పల్లవి:
ఏటీ జన్మమిది హా ఓ రామ ॥ఏ॥


అను పల్లవి:
ఏటి జన్మమిది ఎందుకుఁ గలిగెనో
ఎంతని సైరింతు హా ఓ రామ ॥ఏ॥


చరణము(లు)
సాటిలేని మారకోటి లావణ్యుని
మాటి మాటికిఁ జూచి మాటలాడని తన ॥కే॥


సారెకు ముత్యాల హార మురము పాలు
గారు మోమును గన్నులారఁ జూడని తన ॥కే॥


ఇంగితమెరిగిన సంగీతలోలుని
పొంగుచుఁ దనివార గౌగిలించని తన ॥కే॥


సాగరశయనుని త్యాగరాజనుతుని
వేగమె కూడక వేగేని హృదయము ॥ఏ॥

ఏ రాముని నమ్మితినో నేనే పూలఁబూజ జేసితినో

రాగం: వకుళాభరణం
తాళం: త్రిపుట


పల్లవి:
ఏ రాముని నమ్మితినో నేనే పూలఁబూజ జేసితినో ॥ఏ॥


అను పల్లవి:
వారము నిజదాసవరులకు రిపులైన
వారి మదమణచే శ్రీరాముడుగాదో ॥ఏ॥


చరణము(లు)
ఏకాంతమున సీత సోకార్చిఁ జోగొట్ట
కాకాసుతుఁడు చేయు చీకాకు సైరించు
కోక మదిని దయలేక బాణమునేసి
ఏకాక్షునిఁ జేసిన సాకేతపతి గాదో ॥ఏ॥


దారపుత్రులవద్ద చేరనీక రవికు
మారుని వెలవట బారదోలి గిరిఁ
జేరఁ జేసినట్టి తారానాయకుని సం
హారము జేసిన శ్రీరాముడు గాదో ॥ఏ॥


రోషము నాడు దుర్భాషలను విని వి
భీషణుఁడావేళ ఘోషించి శరణన
దోషరావణు మదశోషకుఁడైన ని
ర్దోష త్యాగరాజ పోషకుఁడు గాదో ॥ఏ॥

ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు, శ్రీరామ! నే

రాగం: అసావేరి
తాళం: ఆది


పల్లవి:
ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు, శ్రీరామ! నే ॥నే॥


అను పల్లవి:
శ్రీపతి! శ్రీరామచంద్ర! నీ చిత్తమునకు తెలియదా? ॥ఏ॥


చరణము(లు)
వాల్మీకాది మునులు, నరులు నిన్ను
వర్ణించిరి నయాశ దీరునా!
మేల్మియౌ యుండును, సద్భక్తులు
మెచ్చుదురే? త్యాగరాజనుత! ॥ఏ॥

ఏ దారి సంచరింతురా ఇఁకఁ బల్కురా

రాగం: శృతిరంజని
తాళం: దేశాది


పల్లవి:
ఏ దారి సంచరింతురా ఇఁకఁ బల్కురా ॥ఏ॥


అను పల్లవి:
శ్రీ దాది మధ్యాంత రహిత
సీతాసమేతగుణాకర నే ॥నే॥


చరణము(లు)
అన్ని తానను మార్గమునకు జనితే
నన్ను వీడను భారమని యనేవు
నన్నుఁ బ్రోవరా సదా యంటే
ద్వైతుఁడనేవు త్యాగరాజనుత ॥ఏ॥

ఏ తావున నేర్చితివో రామ; ఎందుకింత గాసి

రాగం: యదుకులకాంభోజి
తాళం: దేశాది


పల్లవి:
ఏ తావున నేర్చితివో రామ; ఎందుకింత గాసి ॥ఎ॥


అను పల్లవి:
సీతా లక్ష్మణ భరత రిపుఘ్న
వాతాత్మజులతో నాడు నాటక ॥మే॥


చరణము(లు)
ఆలు వజ్రాలు సొమ్ము లడిగిరో
అనుజులు తల్లి దండ్రు లన్న మడిగిరో?
శీలులైన వరభక్తులు బిలచిరో?
చిరకాలము త్యాగరానుత ॥ఏ॥

ఎవ్వరే రామయ్య నీ సరి

రాగం: గాగేయభూషణి
తాళం: దేశాది


పల్లవి:
ఎవ్వరే రామయ్య నీ సరి ॥ఎ॥


అను పల్లవి:
రవ్వకుఁ దావులేక సుజనులను
రాజిగ రక్షించే వా ॥రె॥


చరణము(లు)
పగవానికి సోదరుఁడని ఎంచక
భక్తినెఱిగిఁ లంకాపట్టణ మొసగఁగా
నగధర సురభూసురపూజిత వర
నాగశయన త్యాగరాజవినుత సరి ॥ఎ॥

ఎవరైన లేరా పెద్దలు? ఇలలోన దీనుల బ్రోవను

రాగం: సిద్ధసేన
తాళం: రూపకం


పల్లవి:
ఎవరైన లేరా పెద్దలు?
ఇలలోన దీనుల బ్రోవను ॥ఎవరైన॥


అను పల్లవి:
భవసాగరమున చరించు
బలు గాసి రామునితోఁ దెలుప ॥ఎవరైన॥


చరణము(లు)
కలి మానవాధముల కార్యములు
కామ మత్సరాదుల కృత్యములు
చల చిత్తము లేని దారిపుడు
చాల త్యాగరాజ నుతునితో దెలుప ॥ఎవరైన॥

ఎవరురా నినువినా గతిమాకు

రాగం: మోహన
తాళం: చాపు

పల్లవి:
ఎవరురా నినువినా గతిమాకు ॥ఎ॥

అను పల్లవి:
సవరక్షక నిత్యోత్సవ సీతాపతి ॥ఎ॥

చరణము(లు)
రాదా నాదుపై నీ దయ విన
రాదా మురవైరి గాదా దయఁ బల్క
రాదా ఇది మరియాదా నాతో

వాదమా నే భేదమా మాకు ॥ఎ॥

రాక నన్నేచ న్యాయమా ప
రాక నేనంటే హేయమా రామా
రాకాశశిముఖ నీ కాసించితి
సాకుమా పుణ్యశ్లోకమా మాకు ॥ఎ॥

శ్రీశారిగణారాతివి నా
దాశా తెలియకబోతివి ఆప
గేశార్చిత పాలితేశా నవ
కాశమా స్వప్రకాశమా మాకు ॥ఎ॥

రాజా బిగు నీ కేలరా త్యాగ
రాజార్చిత తాళఁ జాలరా
ఈజాలము సేయ రాజా బ్రోవ సం
కోచమా సురభూజమా మాకు ॥ఎ॥

ఎవరున్నారు బ్రోవ ఇంత తామసమేలనయ్య

రాగం: మాళవశ్రీ
తళం: దేశాది

పల్లవి:
ఎవరున్నారు బ్రోవ
ఇంత తామసమేలనయ్య ॥ఎ॥


అను పల్లవి:
వివరంబుగ దెల్పవయ్య
వెశ్వేశ శ్రీ పంచనదీశ ॥ఎ॥


చరణము(లు)
మనసారగ ధ్యానింపను
మనసు నిలుపు మర్మంబు దెలిపి
తనవాడనే దలచి ధైర్య
మొసగు త్యాగరాజ వినుత ॥ఎ॥

ఎవరి మాట విన్నావో రావొ ఇందులెవో భళిభళి

రాగం: కాంభోజి
తాళం: ఆది


పల్లవి:
ఎవరి మాట విన్నావో రావొ ఇందులెవో భళిభళి ॥ఎ॥


అను పల్లవి:
అవనిలో నార్షేయ పౌరుషేయమంది చోద్యమెఱుఁగ లేనయ్య ॥ఎ॥


చరణము(లు)
భక్తపరాధీనుఁడనుచుఁ బరమభాగవతుల
వ్యక్తరూపుఁడై పలికిన ముచ్చట యుక్తమనుచు నుంటి
శక్తి గల మహాదేవుఁడు నీవని సంతోషమున నుంటి
సత్త చిత్తుడగు త్యాగరాజనుత సత్యసంధుఁ డనుకొంటి నిలలో ॥ఎ॥

Thursday, January 27, 2005

ఎవరని నిర్ణయించిరిరా నిన్నెట్లారిధించిరిరా నర వరు

రాగం: దేవామృతవర్షిణి
తాళం: దేశాది


పల్లవి:
ఎవరని నిర్ణయించిరిరా ని
న్నెట్లారిధించిరిరా నర వరు ॥లె॥


అను పలవి:
శివుఁడనో మాధవుదనో కమల
భవుఁడనో పరబ్రహ్మనో ॥ఎ॥


చరణము(లు)
శివమంత్రమునకు మా జీవము మా
ధవమంత్రమునకు రాజీవము ఈ
వివరముఁ దెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణగుణ త్యాగరాజ వినుత ని ॥న్నె॥

ఎన్నాళ్లు తిరిగెడిది యెన్నాళ్లు?

రాగం: మాళవశ్రీ
తాళం: ఆది


పల్లవి:
ఎన్నాళ్లు తిరిగెడిది యెన్నాళ్లు? ॥ఎన్నాళ్లు॥


అను పల్లవి:
ఎన్నరాని దేహము లెత్తి ఈ సంసార గహనమందు
పన్నుగ చోరుల రీతి పరులను వేఁగించుచును ॥ఎన్నాళ్లు॥


చరణము(లు)
రేపటి కూటికి లేదని రేయిఁ బగలు వెసనమొంది
శ్రీపతి పూజలు మరచి చేసినట్టి వారివలె నే ॥నెన్నాళ్లు॥


ఉప్పు కర్పూరము వరకు నుంఛవృత్తిచే నార్జించి
మెప్పులకు పొట్టనింపి మేమే పెద్దల మనుచు ॥నెన్నాళ్లు॥


భ్రమను కొని ఇరుగుఁ బొరుగు భక్షింప రమ్మని పిలువ
అమరుచుకో పూజ జపము నా సాయము ననుచు ॥నెన్నాళ్ళు॥నాయందు యుండు తప్పులు నాఁడె దెలుసుకొంటివిగాని
బాయ విడువకు మహానుభావ! త్యాగరాజ వినుత ॥నెన్నాళ్లు॥

ఎన్నడు చూతునో ఇనకులతిలక ని

రాగం: కలావతి
తాళం: ఆది

పల్లవి:
ఎన్నడు చూతునో ఇనకులతిలక ని న్నె...

అను పల్లవి:
పన్నగశయన! భక్తజనావన!
పున్నమచందురుఁబోలు ముఖమ్మును ఎ...

చరణము(లు)
ధరణిజ సౌమిత్రి భరత రిపుఘ్న వా
నరయూధపతి వరుఁడాంజనేయుఁడు
కరుణను ఒకరికొకరు వరింప నా
దరణను బిలిచే నిను త్యాగరాజార్చిత! ఎ...

ఎన్నఁగ మనసుకురాని పన్నగశాయి సొగసు

రాగం: నీలాంబరి
తాళం: ఆది


పల్లవి:
ఎన్నఁగ మనసుకురాని పన్నగశాయి సొగసు
పన్నుగఁ గనుగొనని కన్నులేలే కన్నెమిన్నలేలే ॥ఎ॥


చరణము(లు)
మోహముతో నీలవారి వాహకాంతిని గేరిన
శ్రీహరిని గట్టుకొనని దేహమేలే ఈ గేహమేలే ॥ఎ॥


సరసిజ మల్లె తులసీ విరజాజి పారిజాత
విరులచేఁ బూజించని కరములేలే ఈ కాపురములేలే ॥ఎ॥


మాలిమితో త్యాగరాజునేలిన రామమూర్తిని
లాలించి పొగడని నాలికేలే సూత్రమాలికేలే ॥ఎ॥

ఎట్లా దొరకితివో? ఓ రామ తన

రాగం: వసంత
తాళం: ఆది

పల్లవి:
ఎట్లా దొరకితివో? ఓ రామ తన ॥కెట్లా॥


అను పల్లవి:
చుట్లార గడియ దోవకు నాదు
పట్లాభిమానము లేకుండగ ॥ఎట్లా॥


చరణము(లు)
పాద మహిమో పెద్ద లాశీర్వాద బలమో సుస్వరపు
నాదఫలమో త్యాగరాజ ఖేదహర శ్రీనాథ! తన ॥కెట్లా॥

ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే

రాగం: సామ
తాళం: చాపు


పల్లవి:
ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే ॥ఎటులైన॥


అనుపల్లవి:
మటుమాయ భవమును మనదని యెంచక
వటపత్ర శయనుని పాదయుగములందు ॥ఎటులైన॥


చరణము(లు)
విద్యా గర్వము లేల? నీ వ
విద్యా వశము గానేల?
ఖద్యోతాన్వయ తిలకుని పురమేలు
బుద్ధి యాశుగ దోచనేల? ఓ మనసా! ॥ఎటులైన॥


రామ నామము సేయ సిగ్గా? కారా
దేమి బల్కవు పుంటి బుగ్గ
భామలు గరదాటక యుండిన జగ్గ
పామర మేను నమ్మక నీటి బుగ్గ ॥ఎటులైన॥


భోగ భాగ్యములందు నిజ
భాగవతులకౌ నీ పొందు
త్యాగరాజ వరదుని నీ యందు
బాగుగ ధ్యానించు భవ రోగమందు ॥ఎటులైన॥

ఎటులబ్రోతువో తెలియ నేకాంతరామయ్య

రాగం: చక్రవాకం
తాళం: త్రిపుట


పల్లవి:
ఎటులబ్రోతువో తెలియ నేకాంతరామయ్య ॥ఎ॥


అను పల్లవి:
కటకట నా చరితము కర్ణకఠోరమయ్య ॥ఎ॥


చరణము(లు)
వట్టి గొడ్డు రీతి భక్షించి తిరిగితి
పుట్టులోభులను పొట్టకై పొగడితి
దుష్టులతోఁ గూడి దుష్కృత్యములు సల్పి
ఱట్టుబడిన త్యాగరాజుని దయతో ॥ఎ॥

ఎందుకు నిర్దయ ఎవరున్నారురా

రాగం: హరికాభోజి
తాళం: దేశాది

పల్లవి:
ఎందుకు నిర్దయ ఎవరున్నారురా ॥ఎం॥

ఇందునిభానన ఇనకులచందన ॥ఎం॥

పరమపావన పరిమళాపఘన ॥ఎం॥

నే పరదేశీ బాపవే గాసి ॥ఎం॥

ఉడుతభక్తి గని ఉప్పతిల్లఁగ లేదా ॥ఎం॥

శత్రుల మిత్రుల సమముగఁజూచే నీ ॥కెం॥

ధరలో నీవై త్యాగరాజుపై ॥ఎం॥

Wednesday, January 26, 2005

ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ

రాగం: తోడి
తాళం: త్రిపుట


పల్లవి:
ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ కెం...


అను పల్లవి:
సందడి యని మఱచితివో ఇందులే వో నీ కెం...


చరణము(లు)
సారెకు దుర్విషయసార మనుభవించు
వారి చెలిమి సేయనేరక మేను
శ్రీరామ సగమాయెఁ జూచి చూచి
నీరజదళనయన నిర్మలాపఘన ఎం...


తీరని భవనీరధి యాఱడి సైరింప
నేరక భయమందఁగఁ బంకజపత్ర
నీరువిత మల్లాడఁగ ఇట్టి నను జూచి
నీరదాభశరీర నిరుపమ శూర ఎం...


జాగేల ఇది సమయమేగాదు చేసితే
ఏ గతి బలుకవయ్య శ్రీరామ నీ
వేగాని దరిలే దయ్య దీనశరణ్య
త్యాగరాజ వినుత తారక చరిత ఎం...

Tuesday, January 25, 2005

ఎందుండి వెడలితివో? ఏవూరో నే తెలియ ఇపుడైన దెలుపవయ్య

రాగం: దర్బారు
తాళం: త్రిపుట

పల్లవి:
ఎందుండి వెడలితివో? ఏవూరో నే తెలియ
ఇపుడైన దెలుపవయ్య ॥ఎందుండి॥

అను పల్లవి:
అంద చందము వేరై నడత లెల్ల త్రిగు
ణాతీతమై యున్నదుగాని శ్రీరామ ॥ఎందుండి॥

చరణము(లు)
చిటుకంటె నపరాధ చయములఁ దగిలించే శివలోకముగాదు
వటరూపుఁడై బలిని వంచించి మణచువాని వైకుంఠముగాదు
విట వచనము లాడి శిరము ద్రుంపబడ్డ విధిలోకముగాదు
ధిటవు ధర్మము సత్యము మృదు భాషలు గలుగు
దివ్యరూప త్యాగరాజ వినుత నీ ॥వెందుండి॥

ఎందుకు చపలము వినవే నా మనవిని ముందటి వలె భక్తులు పోషించుట

రాగం: తోడి
తాళం: త్రిపుట


పల్లవి:
ఎందు దాగినాఁడో ఈడకు రా
నెన్నడు దయవచ్చునో ఓ మనసా ॥ఎం॥


అను పల్లవి:
ఎందుకు చపలము వినవే నా మనవిని
ముందటి వలె భక్తులు పోషించుట ॥కెం॥


చరణము(లు)
అలనాడు కనక కశిపు నిండారు
చలముఁజేసి సుతుని సకల బా
ధలఁ బెట్టగా మదిని దాళక ని
శ్చలుఁడైన ప్రహ్లదుకొఱకు కంబములో
పల నుండఁగలేదా ఆ రీతిని నే ॥డెం॥


మును వారివాహ వాహన తనయుఁడు మద
మున రవిజుని చాలఁ గొట్టుటఁ జూచి
మనసు తాళఁజాలలేక ప్రేమ
మున పాలనముసేయ తాళతరువు మరు
గున నిల్వఁగలేదా రీతిని నే ॥డెం॥


తొలి జన్మముల నాఁడు జేసిన దుష్కర్మ
ముల నణఁగను సేయ ఆరు శ
త్రులఁగట్టి పొడిసేయ అదియుఁగాక
ఇలలో చంచలము రహిత నిజభక్త జ
నులను త్యాగరాజుని రక్షింప నే ॥డెం॥

ఎందు కౌగిలింతురా? ని - న్నెంతని వర్ణింతురా? ని

రాగం: శుద్ధదేశి
తాళం: ఆది


పల్లవి:
ఎందు కౌగిలింతురా? ని - న్నెంతని వర్ణింతురా? ని ॥న్నెం॥
అను పల్లవి:
అందమైన కుందరవదన - ఇందిరా హృన్మందిరా! ని ॥న్నెం॥


చరణము(లు)
నీదు పలుకె పలుకురా నీదు కులుకే కులుకురా
నీదు తళుకే తళుకురా నిజమైన త్యాగరాజనుత! ని ॥న్నెం॥

ఎందరో మహానుభావు లందరికి వందనము

రాగం: శ్రీ
తాళం: ఆది


పల్లవి:
ఎందరో మహానుభావు లందరికి వందనము ॥ఎం॥


అను పల్లవి:
చందురు వర్ణుని యంద చందమును హృదయార
విందమునఁ జూచి బ్రహ్మానంద మనుభవించు వా ॥రెం॥


చరణము(లు)
సామగానలోల మనసిజలావణ్య ధన్యమూర్ధన్యు లెం..


మానస వనచరవర సంచారము సలిపి
మూర్తి బాగుగఁ బొడగనెడు వా రెం...


సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము జేయు వా రెం...


పతితపావనుఁడగు పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజమా
ర్గముతోను బాడుచును సల్లాపముతో
స్వరలయాది రాగములఁ దెలియు వా రెం...


హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్తకోటు లిలలో
తెలివితోఁ జెలిమితోఁ గరుణ గల్గి
జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా రెం...


హొయలుమీర నడలు గల్గు సరసుని
సదాకనులఁ జూచుచును పులక శ
రీరులై యానందపయోధి నిమగ్నులై
ముదంబునను యశము గల వా రెం...


పరమ భాగవత మౌనివర శశి
విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనకకశిపు
సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్రధర శుక
సరోజభవ భూసురవరులు
పరమపావనులు ఘనులు శాశ్వతులు
కమలభవ సుఖము సదానుభవులు గాక ఎం...


నీ మేని నామ వైభంబులను
నీ పరాక్రమ ధై
ర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమున రఘువర నీయెడ
సద్భక్తియు జనించకను దుర్మతములను
కల్ల జేసినట్టి నీమది
నెఱింగి సంతతంబునను గుణ భజనా
నంద కీర్తనము జేయు వా రెం...


భాగవత రామాయణ గీతాది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మములఁ శివాది షణ్మతముల
గూఢములఁ ముప్పదిముక్కో
టి సురాంతరంగముల భావంబుల
నెఱిఁగి భావ రాగ లయాది సౌఖ్య
ముచే చిరాయువు గలిగి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన వా రెం...


ప్రేమ ముప్పిరి గొను వేళ
నామము దలచువారు
రామభక్తుఁడైన త్యాగ
రాజనుతుని నిజదాసులైన వా రెం...

ఎంతవేడుకొందు రాఘవ పంతమేలరా ఓ రాఘవ

రాగం: సరస్వతీ మనోహరి
తాళం: దేశాది


పల్లవి:
ఎంతవేడుకొందు రాఘవ
పంతమేలరా ఓ రాఘవ ॥ఎం॥


అను పల్లవి:
చింతఁ దీర్చుట కెంతమోడి రా
అంతరాత్మ నాచెంతరాను నే ॥నెం॥


చరణము(లు)
చిత్తమందు నిన్నుఁ జూచు సౌఖ్యమే
ఉత్తమంబనుచు ఉప్పొంగుచును
సత్తమాత్రమా చాల నమ్మితిని
సార్వభౌమ శ్రీత్యాగరాజ నుత ॥ఎం॥

Monday, January 24, 2005

ఎంతరాని తన కెంత పోని నీ చింత విడువఁజాల శ్రీరామ

రాగం: హరికాంభోజి
తాళం: దేశాది

పల్లవి:
ఎంతరాని తన కెంత పోని నీ
చింత విడువఁజాల శ్రీరామ ॥ఎం॥

అను పల్లవి:
అంతకారి నీ చెంతఁ జేరి హను
మంతుఁడై కొలువలేదా ॥ఎం॥

చరణము(లు)
శేషుఁడు శివునికి భూషుఁడు లక్ష్మణ
వేషియై కొలువలేదా ॥ఎం॥

శిష్టుఁడు మౌనివరిష్టుఁడు గొప్ప వ
శిష్టుడు హితుఁడు గాలేదా ॥ఎం॥

నరవర నీకై సురగణమును వా
నరులై కొలువగలేదా ॥ఎం॥

ఆగమోక్తమగు నీ గుణముల శ్రీ
త్యాగరాజు బాడఁగ లేదా ॥ఎం॥

ఎంతముద్దో ఎంత సొగసో ఎవరివల్ల వర్ణింపఁ దగునే

రాగం: బిందుమాలిని
తాళం: ఆది


పల్లవి:
ఎంతముద్దో ఎంత సొగసో
ఎవరివల్ల వర్ణింపఁ దగునే ॥ఎం॥


అను పల్లవి:
ఎంతవారలైనఁ గాని కామ
చింతాక్రాంతులైనారు ॥ఎం॥


చరణము(లు)
అత్తమీఁద కనులాసకు దాసులు
సత్త భాగవత వేసులైరి
దుత్త పాలరుచిఁ దెలియ సామ్యమె
ధురీణుఁడౌ త్యాగరాజ నుతుఁడు ॥ఎం॥

ఎంతనేర్చిన ఎంతజూచిన ఎంతవారలైన కాంతదాసులే

రాగం: సింధుధన్యాసి (ఉదయరవిచంద్రిక)
తాళం: దేశాది


పల్లవి:
ఎంతనేర్చిన ఎంతజూచిన
ఎంతవారలైన కాంతదాసులే ॥ఎం॥


అను పల్లవి:
సంతతంబు శ్రీకాంతస్వాంత సి
ద్ధాంతమైన మార్గచింతలేని వా ॥రెం॥


చరణము(లు)
పరహింస పరభామాన్యధన
పరమానవాపవాద
పరజీవనమ్ముల కనృతమే
భాషించేరయ్య త్యాగరాజ నుత ॥ఎం॥

ఎంతని నే వర్ణింతును శబరీభాగ్య

రాగం: ముఖారి
తాళం: రూపకము


పల్లవి:
ఎంతని నే వర్ణింతును శబరీభాగ్య ॥మెం॥


అను పల్లవి:
దాంతులు వరకాంతలు జగమంత నిండి యుండఁగ ॥నెం॥


చరణము(లు)
కనులార సేవించి కమ్మని ఫలముల నొసఁగి
తనువు పులకరించఁ బాదయుగములకు మ్రొక్కి
ఇనకులపతి సముఖంబున పునరావృత్తి రహిత పద
మును పొందిన త్యాగరాజ నుతురాలి పుణ్యమ్మును ॥ఎం॥

ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి ఎవరీడు ముజ్జగములలోఁ దన


రాగం: సారంగ
తాళం: దేశాది

పల్లవి:
ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి
ఎవరీడు ముజ్జగములలోఁ దన ॥కెం॥


అను పల్లవి:
చెంతఁజేరి సౌజన్యుఁడై పలికి
చింత బాగ తొలగించి బ్రోచితివి ॥ఎం॥

చరణము(లు)
మున్ను మీ సమీపమున వెలయు స
న్ముములనెల్ల నణి మాది లీలలచేఁ
దిన్నగాను పాలనఁ జేసి నటు
నన్నుఁ గాచితివి త్యాగరానుత ॥ఎం॥

ఊరకయే కల్గునా రాముని భక్తి

రాగం: శహాన
తాళం: చాపు


పల్లవి:
ఊరకయే కల్గునా రాముని భక్తి ॥ఊరక॥


అను పల్లవి:
సారెకును సంసారమున జొచ్చి
సారమని యెంచు వారి మనసున ॥నూరక॥


చరణము(లు)
ఆలు సుతులు జుట్టాలు వరసద

నాలు గాయ ఫలాలు కనక ధ
నాలు గల విభవాలఁగని యస్థి
రాలను భాగ్య శాలులకుఁ గాక ॥యూరక॥


మంచి వారిని బొడగాంచి సంతతము సే
వించి మనవి నాలకించి యాదరి సా
ధించి సర్వము హరియంచుఁ దెలిసి భా
వించి మదిని పూజించు వారికి గాక ॥యూరక॥


రాజసగుణ యుక్త పూజల నొనరించ
గజ సన్నుత! త్యాగరాజుని జిహ్వపై
రాజిల్లు వర మంత్ర రాజమును స

దా జపించు మహారాజులకు గాక! ॥యూరక॥

ఉపచారములను చేకొనవయ్య ఉరగరాజ శయన!

రాగం: భైరవి
తాళం: ఆది


పల్లవి:
ఉపచారములను చేకొనవయ్య ఉరగరాజ శయన! ॥ఉప॥


అను పల్లవి:
చపల కోటి నిభాంబరధర!
శ్రీ జానకీపతి! దయజేసి నా ॥దుప॥


చరణము(లు)
కపట నాటక సూత్ర ధారివై
కామిత ఫలము లొసఁగెడు రామ
అపరిమిత నవరత్నము ల్బొదిగిన
యపరంజి గొడుగు నీకే తగునయ్య ॥ఉప॥


మెరుగు తీగలరీతిని మెరసెడు
తఱకు బంగారు కాఁడ లమరిన
శరదిందు ద్యుతి సమానమౌ చా
మర యుగములు నీకే తగునయ్య ॥ఉప॥


జాజులు సంపంగులు మరువపు విర
జాజులు కురువేరు వాసనలను వి
రాజ మానమగు వ్యజనము త్యాగ
రాజ వినుత! నీకే తగునయ్య ॥ఉప॥

ఉపచారము జేసేవారున్నారని మరవకురా

రాగం: భైరవి
తాళం: రూపకము


పల్లవి:
ఉపచారము జేసేవారున్నారని మరవకురా ॥ఉప॥

అను పల్లవి:
కృప కావలెనని నే నీ కీర్తిని పల్కుచు నుండఁగ ॥ఉప॥


చరణము(లు)
వాకిటనే పదిలముగా వాతాత్మజుఁడున్నాడని
శ్రీకరులగు నీ తమ్ములు చేరియున్నారని
ఏకాంతమునను జానకి ఏర్పడి యున్నదని
శ్రీకాంత పరులేలని శ్రీ త్యాగరాజ వినుత ॥ఉప॥

ఉండేది రాముఁడొకడు ఊరక చెడిపోకు మనసా

రాగం: హరికాంభోజి
తాళం: రూపకము


పల్లవి:
ఉండేది రాముఁడొకడు ఊరక చెడిపోకు మనసా ॥ఉం॥

అను పల్లవి:
చండమార్తాండ మధ్యమండలమునను చెలంగుచు ॥ఉం॥


చరణము(లు)
తామసాది గుణరహితుఁడు ధర్మాత్ముఁడు సర్వసముడు
క్షేమకరుఁడు త్యాగరాజచిత్తహితుఁడు జగమునిండి ॥ఉం॥

ఈ వసుధ నీవంటి దైవము నెందు గానరా

రాగం: శహాన
తాళం: ఆది


పల్లవి:
ఈ వసుధ నీవంటి దైవము నెందు గానరా ॥ఈ॥


అను పల్లవి:
భావుకము గల్గి వర్ధిల్లు కోవూరి సుందరేశ గిరీశ ॥ఈ॥


చరణము(లు)
ఆసచే యనిమిషము నీ పుర వాసమొనరఁ జేయువారి మది
వేసటలెల్లను దొలగించి ధన రాసుల నాయువును
భూసురభక్తియు తేజము నొసఁగి భువనమందుఁగీర్తి గల్గఁజేసి
దాసవరద త్యాగరాజ హృదయ నివాస చిద్విలాస సుందరేశ ॥ఈ॥

ఈ వసుధ నీవంటి దైవము నెందు గానరా

రాగం: శహాన
తాళం: ఆది

పల్లవి:
ఈ వసుధ నీవంటి దైవము నెందు గానరా ॥ఈ॥

అను పల్లవి:
భావుకము గల్గి వర్ధిల్లు కోవూరి సుందరేశ గిరీశ ॥ఈ॥

చరణము(లు)
ఆసచే యనిమిషము నీ పుర వాసమొనరఁ జేయువారి మది
వేసటలెల్లను దొలగించి ధన రాసుల నాయువును
భూసురభక్తియు తేజము నొసఁగి భువనమందుఁగీర్తి గల్గఁజేసి
దాసవరద త్యాగరాజ హృదయ నివాస చిద్విలాస సుందరేశ ॥ఈ॥

ఈ వరకు జూచినది చాలదా? ఇంక నా రీతియా?

రాగం: శంకరాభరణం
తాళం: ఆది


పల్లవి:
ఈ వరకు జూచినది చాలదా? ఇంక నా రీతియా? ॥ఈవరకు॥


అను పల్లవి:
పావనము సేయు శక్తి కణగని
పాపము గలదా కరివదన న ॥నీవరకు॥


చరణము(లు)
శ్రీశరణా శుగాశన శయన ప
రేశ నీ పద సుశేశ యార్చనము
నేసేయక దురాశ చే భవపాశ
బద్ధుఁడై గాసి తాళని న ॥న్నీవరకు॥


పరలోక భయ విరహితులై న
నరులు నాదుపై మఱి యసూయల
బఱచిన బాధలు తరముగాక నీ
చరణ యుగములను శరణొందిన న ॥న్నీవరకు॥


నాగాశన సదాగమన ఘృణా
సాగర నిన్ను వినా యెవరు నీ

వే గతియని వేవేగ మొఱలనిడు
త్యాగరాజుని రాగరహిత నీ ॥నీవరకు॥

Sunday, January 23, 2005

ఈ మేను గలిగినందుకు సీతారామ నామమే బల్కవలెను

రాగం: వరాళి
తాళం: ఆది

పల్లవి:
ఈ మేను గలిగినందుకు సీతారామ
నామమే బల్కవలెను ॥ఈమేను॥

అను పల్లవి:
కామాది దుర్గుణ స్తోమ పూరితమైన
పామరత్వమేగాని నేమము లేనట్టి ॥ఈమేను॥

చరణము(లు)
సంసారమున బ్రోవ దారిని పర
హింసజెందు కిరాతుఁడు
హంసరూపుల గతినడుగ రామనామ ప్ర
శంసజేసి యుపదేశించ ధన్యుఁడు గాలేదా? ॥ఈమేను॥

తాపసి శాపమిడగా జలోరగ
రూపముగొని యుండగా
తాపము సైరించక తల్లడిల్లగ శర
చాపధరుని నామ శ్రవణము బ్రోవలేదా? ॥ఈమేను॥

కరిరాజు తెలియలేక బలుఁడైన మ
కరిచేత గాసి జెందగా
అరలేక నిజమున నాదిమూలమనగ
వరదుఁడు వేగమే వచ్చి బ్రోవగలేదా ॥ఈమేను॥

ఆగమ వేదములను దానవుఁడు గొంపో
వగా చతురాననుఁడు
త్యాగరాజనుత తారక నామ యని
బాగున నుతింప భయము దీర్పగ లేదా? ॥ఈమేను॥

ఇన్నాళ్ళు దయరాకున్న వైనమేమి? ఇపుడైన దెలుపవయ్య!

రాగం: నారాయణ గౌళ
తాళం: చాపు

పల్లవి:
ఇన్నాళ్ళు దయరాకున్న వైనమేమి?
ఇపుడైన దెలుపవయ్య! ॥ఇన్నాళ్ళు॥

అను పల్లవి:
చిన్న నాట నుండి నిన్నేగాని నే
నన్యుల నమ్మితినా? ఓ రామ! ॥ఇన్నాళ్ళు॥

చరణము(లు)
అలనాడు తరణి సుతార్తినిఁ దీర్పను
వలసి నిల్వగ లేదా? అదియుగాక
బలము జూపలేదా? వాని నేర
ములఁ దాళుకొని చెలిమిఁజేసి పద
ముల భక్తి నియ్యగ లేదా? నాయందు నీ ॥కిన్నాళ్ళు॥

ధన గజాశ్వములు దనకుఁ గలుగఁ జేయు
మని నే నిన్నడిగితినా? ఇఁక నే
కనక మిమ్మనినానా? శ్రీరామ నా
మనమున నిను కులధముగ సం
రక్షణముఁ జేసితిగాని మరచితినా? ॥ఇన్నాళ్ళు॥

తల్లి తండ్రి యన్నదమ్ములు నీవని
యుల్లము రంజిల్లఁ బెద్దలతోను
కల్లలాడక మొల్ల సుమముల నీ
చల్లని పదములఁ గొల్లలాడుచు వెద
జల్లితిగాని త్యాగరాజునిపై నీ ॥కిన్నాళ్లు॥

ఇన్నాళ్ళు దయరాకున్న వైనమేమి? ఇపుడైన దెలుపవయ్య!

రాగం: నారాయణ గౌళ
తాళం: చాపు


పల్లవి:
ఇన్నాళ్ళు దయరాకున్న వైనమేమి?
ఇపుడైన దెలుపవయ్య! ॥ఇన్నాళ్ళు॥


అను పల్లవి:
చిన్న నాట నుండి నిన్నేగాని నే
నన్యుల నమ్మితినా? ఓ రామ! ॥ఇన్నాళ్ళు॥


చరణము(లు)
అలనాడు తరణి సుతార్తినిఁ దీర్పను
వలసి నిల్వగ లేదా? అదియుగాక
బలము జూపలేదా? వాని నేర
ములఁ దాళుకొని చెలిమిఁజేసి పద
ముల భక్తి నియ్యగ లేదా? నాయందు నీ ॥కిన్నాళ్ళు॥


ధన గజాశ్వములు దనకుఁ గలుగఁ జేయు
మని నే నిన్నడిగితినా? ఇఁక నే
కనక మిమ్మనినానా? శ్రీరామ నా
మనమున నిను కులధముగ సం
రక్షణముఁ జేసితిగాని మరచితినా? ॥ఇన్నాళ్ళు॥


తల్లి తండ్రి యన్నదమ్ములు నీవని
యుల్లము రంజిల్లఁ బెద్దలతోను
కల్లలాడక మొల్ల సుమముల నీ
చల్లని పదములఁ గొల్లలాడుచు వెద
జల్లితిగాని త్యాగరాజునిపై నీ ॥కిన్నాళ్లు॥

ఇన్నాళ్ళు దయరాకున్న వైనమేమి? ఇపుడైన దెలుపవయ్య!

రాగం: నారాయణ గౌళ
తాళం: చాపు


పల్లవి:
ఇన్నాళ్ళు దయరాకున్న వైనమేమి?
ఇపుడైన దెలుపవయ్య! ॥ఇన్నాళ్ళు॥


అను పల్లవి:
చిన్న నాట నుండి నిన్నేగాని నే
నన్యుల నమ్మితినా? ఓ రామ! ॥ఇన్నాళ్ళు॥


చరణము(లు)
అలనాడు తరణి సుతార్తినిఁ దీర్పను
వలసి నిల్వగ లేదా? అదియుగాక
బలము జూపలేదా? వాని నేర
ములఁ దాళుకొని చెలిమిఁజేసి పద
ముల భక్తి నియ్యగ లేదా? నాయందు నీ ॥కిన్నాళ్ళు॥


ధన గజాశ్వములు దనకుఁ గలుగఁ జేయు
మని నే నిన్నడిగితినా? ఇఁక నే
కనక మిమ్మనినానా? శ్రీరామ నా
మనమున నిను కులధముగ సం
రక్షణముఁ జేసితిగాని మరచితినా? ॥ఇన్నాళ్ళు॥


తల్లి తండ్రి యన్నదమ్ములు నీవని
యుల్లము రంజిల్లఁ బెద్దలతోను
కల్లలాడక మొల్ల సుమముల నీ
చల్లని పదములఁ గొల్లలాడుచు వెద
జల్లితిగాని త్యాగరాజునిపై నీ ॥కిన్నాళ్లు॥

ఇది నీకు మేరగాదుర శ్రీరామ! నా - మది తల్లడిల్లెనురా

రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది


పల్లవి:
ఇది నీకు మేరగాదుర శ్రీరామ! నా - మది తల్లడిల్లెనురా ॥ఇది॥
అను పల్లవి:
పదిలముగఁ గొల్చిన - భావము వేరై యున్నది ॥ఇది॥


చరణము(లు)
గతి లేనివారినిఁ గడతేర్చు దైవమని
పతితపావన! నమ్మితి; శ్రీరామ!
న్నతి వేగమున వేడితి; సంతతము స
మ్మతిని నిన్నే కోరితి; శ్రీరామ! ॥ఇది॥


పరమ దయాళువని, పాలన సేతువని
సరగున, దేవరాయ! గొల్చిన నాపైఁ
గరుణ లేదని కన్నీరాయె, జూచి నీ మనసు
గరఁగ దెందుకురా? ఓ శ్రీరామ! ॥ఇది॥


అన్నిట నిండవే, అద్భుతానందఘన!
మన్నన సేయ రాదా? శ్రీరామ! నీ
కెన్నరాని పుణ్యము రాదా? శ్రీత్యాగరాజ
సన్నుత! నీ వాఁడను గాదా, శ్రీరామ! సీతారామ ॥ఇది॥

ఇతరదైవములవల్ల ఇలను సౌఖ్యమా రామ

రాగం: ఛాయాతరంగిణి
తాళాం: రూపకము

పల్లవి:
ఇతరదైవములవల్ల ఇలను సౌఖ్యమా రామ ॥ఇ॥

చరణము(లు)
మతభేదములేక సదా మదిని మరులుకొన్న తన
మనసుదెలిసి ప్రోచినను మరచినాను నీవె
తనవాడన తరుణమిది త్యాగరాజ సన్నుత ॥ఇ॥

ఇక గావలసిన దేమి మనసా? సుఖమున నుండవదేమి?

రాగం: బలహంస
తాళం: ఆది

పల్లవి:
ఇక గావలసిన దేమి మనసా? సుఖమున నుండవదేమి? ॥ఇక॥

అను పల్లవి:
అఖిలాండ కోటి బ్రహ్మాండనాథుఁ
డంతరంగమున నెలకొని యుండగ ॥నిక॥

చరణము(లు)
ముందటి జన్మములను జేసిన యఘ
బృంద విపినముల కా
నంద కందుఁడైన సీతాపతి
నందకాయుధుడై యుండగ ॥నిక॥

కామాది లోభ మోహ మద
స్తోమ తమమ్ములకును
సోమ సూర్య నేత్రుడైన శ్రీ
రామచంద్రుఁడే నీ యందుండగ ॥నిక॥

క్షేమాది శుభములను త్యాగరాజ
కామితార్థములను
నీమమున నిచ్చే దయానిధి
రామభద్రుఁడే నీయం దుండగ ॥నిక॥

ఇక గావలసిన దేమి మనసా? సుఖమున నుండవదేమి?

రాగం: బలహంస
తాళం: ఆది

పల్లవి:
ఇక గావలసిన దేమి మనసా? సుఖమున నుండవదేమి? ॥ఇక॥


అను పల్లవి:
అఖిలాండ కోటి బ్రహ్మాండనాథుఁ
డంతరంగమున నెలకొని యుండగ ॥నిక॥


చరణము(లు)
ముందటి జన్మములను జేసిన యఘ
బృంద విపినముల కా
నంద కందుఁడైన సీతాపతి
నందకాయుధుడై యుండగ ॥నిక॥


కామాది లోభ మోహ మద
స్తోమ తమమ్ములకును
సోమ సూర్య నేత్రుడైన శ్రీ
రామచంద్రుఁడే నీ యందుండగ ॥నిక॥


క్షేమాది శుభములను త్యాగరాజ
కామితార్థములను
నీమమున నిచ్చే దయానిధి
రామభద్రుఁడే నీయం దుండగ ॥నిక

ఇంత భాగ్యమని నిర్ణయింప బ్రహ్మేంద్రాదుల తరమా?

రాగం: పున్నాగవరాళి
తాళం: చాపు


పల్లవి:
ఇంత భాగ్యమని నిర్ణయింప బ్రహ్మేంద్రాదుల తరమా? ॥ఇంత॥

అను పల్లవి:
చింతనీయ! శ్రీరాఘవ! నిను మదిఁ
జింతించు సుజనుల పూజించినవారి ॥కింత॥


చరణము(లు)
మతిహీనులైన, నెమ్మతిలేనివారైన
నతి పాపకృతులైన, నెన్నటికి స
ద్గతిరానివారైన, శ్రీరామ! శ్రుతి పురాణ నుత!
ప్రతిలేని నిన్ను సన్నుతి సేయు భక్తుల జతఁగూడిన వారి ॥కింత॥


సారెకు మాయ సంసారమందు చాల
దూరినవారై నఁ, గామాదులు
పూరిత మతులా న, సకల వేదసార! నిన్ను మన
సార నమ్మిన సుధాపూర చిత్తుల సేవఁ గోరినవారి ॥కింత॥


భర్మ చేల! నీదు మర్మముఁ దెలియని
కర్మమార్గులై న, త్యాగరాజు నుత!
ధర్మరహితులై న, లోకములు నిర్మించిన నీదు
శర్మము స్మరియించు నిర్మల మతుల శర్మమొంచినవారి ॥కింత॥

ఆరగింపవే, పా - లారగింపవే

రాగం: తోడి
తాళం: రూపకము


పల్లవి:
ఆరగింపవే, పా - లారగింపవే ॥ఆరగింపవే॥


అను పల్లవి:
రఘు వీర జనకజా కర పవిత్రితమౌ వెన్న పా ।।లారగింపవే॥
చరణము(లు)
సారమైన దివ్యాన్నము - షడ్రసయుత భక్షణములు
దార సోదరాదులతో, త్యాగరాజు వినుత! పా ॥లారగింపవే॥

అనంద సాగరమీదని దేహము భూమి భారము; రామ!

రాగం: గరుడ ధ్వని
తాళం: దేశాది


పల్లవి:
అనంద సాగరమీదని దే
హము భూమి భారము; రామ! బ్ర ॥హ్మానంద॥


అను పల్లవి:
శ్రీనాయకాఖిల నైగమా
శ్రిత సంగీత జ్ఞానమను బ్ర ॥హ్మానంద॥


చరణము(లు)
శ్రీ విశ్వనాథాది శ్రీకాంత విధులు
పావన మూర్తులుపాసింప లేదా?
భావించి రాగ లయాదులఁ
భజియించు శ్రీత్యాగరాజనుత ॥ఆనంద॥

ఆదయ శ్రీరఘువర! నేడేల - రాదయ? ఓ దయాంబుధి! నీ

రాగం: ఆహిరి
తళం: ఆది

పల్లవి:
ఆదయ శ్రీరఘువర! నేడేల - రాదయ? ఓ దయాంబుధి! నీ ॥కా॥

అనుపల్లవి:
మోదముతో సద్భక్తి మర్మమును - బోధన జేసి సదా బ్రోచిన నీ ॥కా॥
చరణము(లు)
నిన్ను తిట్టితొట్టి హింసబెట్టిన దన్నియు నన్నన లేదా?
ఎన్నరాని నిందలఁ దాళుమని మన్నించగ లేదా?
అన్నముఁ దాంబూల మొసగి దేహము మిన్నఁ జేయ లేదా?
కన తల్లి దండ్రి మేమనుచు త్యాగరాజునికిఁ బరవసమీ లేదా? నీ ॥కా॥

ఆడమోడి గలదే రామయ్యమాట

రాగం: చారుకేశి
తాళం: దేశాది

పల్లవి:
ఆడమోడి గలదే రామయ్యమాట ॥లా॥

అను పల్లవి:
తోడునీడ నీవె యనుచు భక్తితోఁ
గూడి పాదములఁ బట్టినమాట ॥లా॥

చరణము(లు)
చదువులన్ని దెలిసి శంకరాంశుఁడై
సదయుఁడాశుగ సంభవుండు మ్రొక్క
గదలు తమ్ముని బల్కఁ జేసితివి
గాకను త్యాగరాజే పాటి మాట ॥లా॥

అలక లల్లలాడఁగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో

రాగం: మధ్యమావతి
తాళం: రూపకము

పల్లవి:
అలక లల్లలాడఁగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో ॥అ॥

అను పల్లవి:
చెలువు మీఱఁగను మారీచుని మదమణఁచే వేళ ॥అ॥

చరణము(లు)
ముని కనుసైగఁ దెలిసి శివ - ధనువును విఱిచే సమయ
మున త్యాగరాజు విను - తుని మోమున రంజిల్లు ॥అ॥

ఇందుకా ఈ తనువును బెంచిన

రాగం: ముఖారి
తాళం: చాపు

పల్లవి:
ఇందుకా ఈ తనువును బెంచిన ॥దిందుకా॥


చరణము(లు)
నీ సేవకులేక నీకు చెంతకురాక
ఆశదాసుఁడై అటులిటుదిరుగు ॥టందుకా॥

నిరతము నీ దృష్టినే యార్జింపక
ఒరుల భామలను ఓర జూపులు జూచు ॥టందుకా॥

సారెకు నామస్మరణము జేయక
యూరిమాట లెల్ల యూరక వదరు ॥టందుకా॥

కరములతో పూజ గావింపక డాచి
ధరలోన లేని దుర్దానములకు చాచు ॥టందుకా॥

వారము నీ క్షేత్రవరముల చుట్టక
భూరికి ముందుగా పారిపారి తిరుగు ॥టందుకా॥

నీవాఁడని పేరు నిందు వహింపక
నావాఁడని యముఁడు నవ్వుచు బాధించు ॥టందుకా॥

రావయ్య శ్రీ త్యాగరాజ వినుత నిన్ను
భావింపక ప్రొద్దు బారగొట్టుకొను ॥టందుకా॥


అమ్మ! రావమ్మ తులసమ్మ నను పాలింపవమ్మ

రాగం: కల్యాణి
తాళం: ఝంప


పల్లవి:
అమ్మ! రావమ్మ తులసమ్మ నను పాలింప

వమ్మ! సతతము పదములే నమ్మి నానమ్మ ॥అమ్మ॥

అను పల్లవి:
నెమ్మదిని నీ విహ పరమ్ము లొసగుదు వనుచు
కమ్మవెల్తుని తండ్రి గలనైన బాయడట ॥అమ్మ॥


చరణము(లు)
నీ మృదు తనువును గని - నీ పరిమళమును గని
నీ మహత్వమును గని - నీరజాక్షి
తామరస దళనేత్రు - త్యాగరాజునిమిత్రు
ప్రేమతో శిరమునను - బెట్టుకొన్నాడట ॥అమ్మ॥

ఇంతకన్నానందమేమొ ఓరామ రామ

రాగం: బిలహరి
తాళం: రూపకము


పల్లవి:
ఇంతకన్నానందమేమొ ఓరామ రామ ॥ఇం॥


అను పల్లవి:
సంతజనులకెల్ల సమ్మతియుంటే కాని ॥ఇం॥


చరణము(లు)
ఆడుచు నాదమునఁ బాడుచు ఎదుటరా
వేడుచు మనసునఁగూడి యుండేది చాలు ॥ఇం॥


శ్రీహరికీర్తనచే దేహాదియింద్రియ స
మూహముల మఱచి సోహమైనదె చాలు ॥ఇం॥


నీజపములవేళ నీజగములు నీపై
రాజిల్లు నయ త్యాగరాజనుత చరిత్ర ॥ఇం॥

ఇంత సౌఖ్యమని నేఁ జెప్పజాల

రాగం: కాపి
తాళం: ఆది

పల్లవి:
ఇంత సౌఖ్యమని నేఁ జెప్పజాల
ఎంతో యేమో యెవరికిఁ దెలుసునో? ॥ఇంత॥

అను పల్లవి:
దాంత! సీతాకాంత! కరుణా
స్వాంత! ప్రేమాదులకే దెలుసునుగాని ॥ఇంత॥

చరణము(లు)
స్వరరాగలయ సుధారసమందు
వర రామనామమనే కండ చ
క్కెర మిశ్రముఁజేసి భుజించే శం
కరునికి దెలుసును త్యాగరాజువినుత ॥ఇంత॥

Saturday, January 22, 2005

అనాథుఁడనుగాను రామ నే

రాగం: జంగలా
తాళం: ఆది


పల్లవి:
అనాథుఁడనుగాను రామ నే ॥న॥


అను పల్లవి:
అనాథుఁడవు నీ వని నిగమజ్ఞుల
సనాతనులమాట విన్నాను నే ॥న॥


చరణము(లు)
నిరాదరపుఁజూచి ఈ కలి
నరాధములనేరు
పురాణపురుష పురరిపునుత నా
గరాట్ఛయన త్యాగరాజనుత నే ॥న॥

అది కాదు భజన మనసా!

రాగం: యదుకుల కాంభోజి
తాళం: ఆది

పల్లవి:
అది కాదు భజన మనసా! ॥అది॥

అనుపల్లవి:
యదలో నెంచు టొకటి ప-య్యెద గల్గినచో నొకటి ॥అది॥

చరణము(లు)
గొప్ప తనముకై యాస
కుచ్చిత విషయ పిపాస
మెప్పులకై బహు వేస మిడి
ఉప్పతిల్లెదరు; త్యాగరాజ వినుత! ॥అది॥

అమ్మ ధర్మసంవర్ధని, యాదుకోవమ్మ

రాగం: అఠాణ
తాళం: ఆది


పల్లవి:
అమ్మ ధర్మసంవర్ధని, యాదుకోవమ్మ మా ॥యమ్మ॥


అను పల్లవి:
ఇమ్మహి నీ సరి యెవరమ్మ శివుని కొమ్మ మా ॥యమ్మ॥


చరణము(లు)
ధాత్రి ధరనాయక ప్రియ
పుత్రి మదనకోటి మంజుల
గాత్రి అరుణ నీరజదళ
నేత్రి నిరుపమ శుభ
గాత్రి పీఠనిలయె వర హ
స్తధృత వలయె పరమ ప
విత్రి భక్త పాలన ధురంధరి
వీరశక్తి నే నమ్మినా ॥నమ్మ॥


అంబ కంబుకంఠి చారుక
దంబ గహన సంచారిణి
బింబాధర తటిత్కోటి
నిభాభరి దయావారినిధే
శంబరారి వైరి హృచ్చంకరి
కౌమారి స్వరజిత
తుంబురు నారద సంగీత మాధుర్యె
దురితహారిణి మా ॥యమ్మ॥


ధన్యే త్ర్యంబకే మూర్థన్యే
పరమయోగి హృదయ
మాన్యె త్యాగరజకుల శ
రణ్యె పతితపావని కా
రుణ్యసాగరి సదా అపరోక్షము
గారాదా సహ్య
కన్యా తీరవాసిని పరాత్పరి
కాత్యాయని రామసోదరి మా ॥యమ్మ॥

అపరాధముల నోర్వ సమయము

రాగం: వనాళి
తాళం: ఆది

పల్లవి:
అపరాధముల నోర్వ సమయము
కృప జూడు ఘనమైన నా ॥అ॥


అనుపల్లవి:
చపలచిత్తుఁడై మనసెఱుఁగకనే
జాలికలుగజేసుకొని మొరలనిడే ॥అ॥


చరణము(లు)
సకలలోకుల ఫలాఫలము లెఱిఁగి
సంరక్షించుచునుండఁగ న
న్నొకని బ్రోవ తెలియును కీర్తన సుశతక
మొనర్చుకొన్న త్యాగరాజుని ॥అ॥

అతడే ధన్యుడురా; ఓమనసా!

రాగం: కాపి
తాళం: చాపు

పల్లవి:
అతడే ధన్యుడురా; ఓమనసా! ॥అతడే॥

అనుపల్లవి:
సతతయాన సుత ధృతమైన సీతా
పతి పాదయుగమును సతతము స్మరియించు ॥నతడే॥

చరణము(లు)
వెనుకఁదీక తనమనసు రంజిల్లగ
ఘనమైన నామకీర్తన పరుఁడైనట్టీ ॥యతడే॥

తుంబురువలె తన తంబూరబట్టి ద
యాంబుధి సన్నిధానంబున నటియించు ॥నతడే॥

సాయకు సుజనుల బాయక తాను ను
పాయమునను ప్రొద్దు హాయిగ గడపు ॥నతడే॥

ఉల్లపు తాపము చల్లజేసి యన్ని
కల్లలను యెంచి సలాపమున నుండు ॥నతడే॥

కరివరదుని తత్వ మెఱుఁగను మఱి గించి
అరిషడ్వర్గములందు బరవలేకఁ దిరుగు ॥నతడే॥

ఆర్తిని మఱియు బ్రవర్తినిఁ దొలగించి
కీర్తిగల్గిన రామమూర్తిని నెరనమ్ము ॥నతడే॥

కలగని నిజ విప్రకులమున జన్మించి
నిలువరమగు ముక్తి ఫలమును జేకొన్న ॥యతడే॥

కర్మ నిష్టుఁడైన ధర్మశీలుఁడైన
శర్మ రామనామ మర్మము దెలిసిన ॥యతడే॥

కాసు వీసములకోసము ఆసతో
వేసము ధరియించి మోసము జెందని ॥యతడే॥

అందముగా నామ మందరు జేసిన
సుందర రామునియందు లక్ష్యము బెట్టు ॥అతడే॥

అన్ని పాటుకు సర్వోన్నత సుఖ
మున్న యనుభవించుకొన్న వాఁడెవఁడో ॥అతడే॥

రాజస జనులతోఁ దా జతగూడక
రాజిల్లు శ్రీత్యాగరాజనుతుని నమ్ము ॥అతడే॥

అన్యాయము సేయకురా రామ!

రాగం: కాపి
తాళం: ఆది

పల్లవి:
అన్యాయము సేయకురా రామ! న
న్నన్యునిగ జూడకురా; నాయెడ, రామ! ॥అన్యాయము॥


అనుపల్లవి:
ఎన్నో తప్పులు గలవారిని, రా
జన్య! నీవు బ్రోచినావు గనుకను ॥అన్యాయము॥


చరణము(లు)
జడభరతుఁడు జింక శిశువునెత్తి బడలిక దీర్చగ లేదా?
కడలిని మునిగిన గిరి కూర్మము గాపాడ లేదా?
పుడమిని పాండవ ద్రోహిని ధర్మ పుత్రుఁడు బ్రోవగ లేదా?
నడమి ప్రాయమున త్యాగరాజనుత!
నా పూర్వజు బాధ దీర్ప లేదా? ॥అన్యాయము॥

అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు

రాగం: సరస్వతి
తాళం: రూపకం


పల్లవి:
అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు ॥అ॥


అనుపల్లవి:
ఘనులైన యంతర్జ్ఞానుల కెఱుకేగాని ॥అ॥


చరణము(లు)
వగవగగా భుజియించువారికి తృప్తియౌరీతి
సగుణధ్యానముపైని సౌఖ్యము త్యాగరాజనుత ॥అ॥

అనుపమగుణాంబుధీ యని నిన్ను నెరనమ్మి యనుసరించినవాడనైతి

రాగం: అఠాణ
తాళం: జంప


పల్లవి:
అనుపమగుణాంబుధీ యని నిన్ను
నెరనమ్మి యనుసరించినవాడనైతి ॥అ॥


చరణము(లు)
మనుపకయె యున్నావు మనుపతీ వ్రాసి మేననుప
మాకెవరు వినుమా దయరాని ॥అ॥


జనకజామాతవై జనకాజామాతవై
జనక జాలము చాలు చాలును హరీ ॥అ॥


కనక పటధర నన్ను కన కపటమేల తను
కనకపఠనము సేతుగాని బూని ॥అ॥


కలలోన నీవే సకలలోకనాథా కో
కల లోకువగనిచ్చి గాచినది విని ॥అ॥


రాజకుల కలశాబ్ధరాజ సురపాల గజ
రాజ రక్షక త్యాగరాజ వినుత ॥అ॥

Friday, January 21, 2005

అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా

రాగం: మధ్యమావతి
తాళం: రూపకం

పల్లవి:
అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా?
ఆదిమూలమా! రామ! ॥అడిగి॥

అనుపల్లవి:
సడలని పాప తిమిరకోటి సూర్య!
సార్వభౌమ! సారసాక్ష! సద్గుణ! ని ॥న్నడిగి॥

చరణము(లు)
అశ్రయించి వరమడిగిన సీత
యడవికిఁ బోనాయె;
ఆశరహరణ! రక్కసి ఇష్టమడగ
నపుడె ముక్కువోయె; ఓ రామ! ని ॥న్నడిగి॥

వాసిగ నారదమౌని వరమడుగ
వనిత రూపుఁడాయె,
ఆశించి దూర్వాసులు అన్నమడుగ
అపుడె మందమాయె; ఓరామ! ని ॥న్నడిగి॥

సుతుని వేడుక జూడ దేవకి యడుగ య

శోద జూడ నాయె;
సతులెల్ల రతి భిక్షమడుగ వారివారి
పతుల వీడనాయె; ఓరామ! ని ॥న్నడిగి॥

నీకేఁ దయబుట్టి బ్రోతువో! బ్రోవవో!

నీ గుట్టు బయలాయె;
సాకేతధామ! శ్రీత్యాగరాజనుత!
స్వామి! యేటి మాయ? ఓరామ! ని ॥న్నడిగి॥

అట్ట బలుకుదు విట్ట బలుకుదు వందుకేమి సేతు రామ

రాగం: అఠాణ
తాళం: ఆది

పల్లవి:
అట్ట బలుకుదు విట్ట బలుకుదు
వందుకేమి సేతు రామ? నీ ॥వాట్ట॥

అను పల్లవి:
తొట్లనర్భకుల సూతువు; మఱి మఱి

తోచినట్టు గిల్లుదువు; శ్రీరామ! నీ ॥వాట్ట॥

చరణము(లు)
జీవుల శిక్షించగ నేర్తువు; చిరం

జీవులుగాఁ జేయ నేర్తువురా
భావ మెఱిఁగి బ్రోతువు; సద్భక్త-
భాగధేయ! శ్రీత్యాగరాజ వినుత! ॥అట్ట॥


అటుకారాదని బల్క నభిమానము లేకపోయెనా అ...

రాగం: మనోరంజని
తాళం: ఆది

పల్లవి:
అటుకారాదని బల్క నభిమానము లేకపోయెనా అ...

అనుపల్లవి:
ఎటులోర్తును ఓ దయఁజూడవయ్య
ఏ వేల్పు సేయు చలమో దెలిసి అ...

చరణము(లు)
వేదశాస్త్రోపనిషద్విదుఁడైన
నిజదారినిబట్టి దాసుఁడైన
నాదుపై నెపమెంచితే త్యాగరాజనుత అ...