Friday, December 01, 2006

కారుబారు సేయువారు గలరే

రాగం: ముఖారి
తాళం: ఆది

పల్లవి:
కారుబారు సేయువారు గలరే? నీవలె సాకేత నగరిని ||కారు||

అను పల్లవి:
ఊరివారు దేశజనులు వరమునులు
ఉప్పొంగుచును భావకులయ్యెడు ||కారు||

చరణము(లు):
నెలకు మూఁడువాన లఖిల విద్యల
నేర్పు గలిగి, దీర్ఘాయువు గలిగి
చలము గర్వరహితులు గాలేద?
సాధు త్యాగరాజ వినుత రామ! ||కారు||

Tuesday, November 28, 2006

కళల నేర్చిన మును జేసినది

రాగం: దీపక
తాళం: దేశాది

పల్లవి:
కళల నేర్చిన మును జేసినది
గాక నేమి యరవై నాలుగు క..

అను పల్లవి:
కలిమిలేములకుఁ గారణంబు నీవే
కరుణఁజూడవే కడుపుకోసమై క...

చరణము(లు):
కోరి నూపురకొండ దీసి శింగరిముని
కూర్మి భుజించెనా? వైరి తమ్ముడు
సారమైన రంగని ఇల్లు జేర్చెనా?
సరస త్యాగరాజవినుత బ్రోవవే క...

Thursday, November 23, 2006

కలుగునా పదనీరజ సేవ? గంధవాహ తనయ

రాగం: పూర్ణలలిత
తాళం: ఆది

పల్లవి:
కలుగునా పదనీరజ సేవ? గంధవాహ తనయ ||కలుగునా||

అను పల్లవి:
పలుమారు జూచుచు బ్రహ్మానందుఁడై
బరగెడు భక్తాగ్రేసర! తనకు ||కలుగునా||

చరణము(లు):
వేకువ జామున నీ కరమున నిడి
శ్రీకాంతుఁ డమృత స్నానము జేసి తా సీ,
తా కరములచే భుజించి నిను సా
త్వీక పురాణ పఠన జేయుమను
సాకేత పతిని సర్వాధారుని
ప్రాకటముగ త్యాగ రాజనుతుని గన ||కలుగునా||

Thursday, November 16, 2006

కలిగియుంటే గదా కల్గును కామితఫలదాయక

రాగం: కీరవాణి
తాళం: ఆది

పల్లవి:
కలిగియుంటే గదా కల్గును
కామితఫలదాయక క...

అను పల్లవి:
కలిని ఇంగిత మెఱుఁగక నిన్నాడుకొంటి
చలముచేయక నాతలను చక్కని వ్రాఁత క...

చరణము(లు):
భాగవతాగ్రేసరులగు నారద
ప్రహ్లాద పరాశర రామదాసులు
బాగుగ శ్రీరఘురాముని పదముల
భక్తిఁ జేసినరీతి త్యాగరాజుని కిపుడు క...

Wednesday, November 15, 2006

కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా

రాగం: కుంతలవరాళి
తాళం: దేశాది

పల్లవి:
కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా క...

అను పల్లవి:
ఇలను వెలయ వర వృష రాజుల కటు
కులరుచి తెలియు చందముగానీ క..

చరణము(లు)
దారసుతులకై ధనములకై యూరు
పేరులకై బహు పెద్దతనముకై
సారెకు భక్తవేసముకొనువారికి
తారకనామ శ్రీ త్యాగరాజార్చిత క...

Tuesday, November 14, 2006

కరుణాసముద్ర, నను కావవే, శ్రీరామభద్ర

రాగం: దేవగాంధారి
తాళం: ఆది

పల్లవి:
కరుణాసముద్ర, నను కావవే, శ్రీరామభద్ర ||కరుణా||

అనుపల్లవి:
శరణాగత హృచ్ఛిద్ర శమన నిర్జిత నిద్ర ||కరుణా||

చరణము(లు):
నాపపము నాతో నుండిన
శ్రీప నీ బిరుదు కేమి బ్రతుకు
యే పాపుల శాపమో
యెందు కీచలము త్యాగరాజనుత ||కరుణా||

Monday, November 13, 2006

కరుణాజలధే, దాశరధే, కమనీయ సుగుణ నిధే

రాగం: కేదారగౌళ
తాళం: చాపు

పల్లవి:
కరుణాజలధే, దాశరథే, కమనీయ సుగుణ నిధే ||కరుణా||

అను పల్లవి:
తరుణాంబుజ నిభ చరణా!
సురమదహరణా! శ్రితజన శరణాద్భుతఘన! ||కరుణా||

చరణము(లు):
మనవిని వినక యోచన జేసిన నే
విననయ్య శ్రీరామ! ఓ పరమ పా
వన! తారక నామ! సుగుణధామ!
జనకతనయావన! చతుర్ముఖ
జనక! జనక వచన సుపరి పా
లనము జేసిన వనజలోచన!
సనకసుత! మా ధనము నీవే ||కరుణా||

సురముని వరనుత! సరసముతో నన్ను
కరుణించిన నీదు తండ్రి సొమ్ము
వెరవక బోనేరదు ఎందుకు వాదు?
హరిగణాధిప పరిచ! రాగమ
చర! పరాత్పర! తరముగాదిక
చరణ భక్తి వితరణ మొసగను
తరుణమిది, శ్రీకర! ధరాధిప! ||కరుణా||

ధనమదమున నుండు మనుజుల నేను యా
చన సేయగ లేనురా త్యాగరాజ
వినుత! ఘృణాసాగర! సమీర
తనయ సేవిత! ధనదనుత! స
జ్జన మనోహర! ఘనరవ స్వర!
మనసు చాలా వినదురా యీ
తనువు నీదని వినుతి జేసెద ||కరుణా||