Sunday, January 23, 2005

ఇక గావలసిన దేమి మనసా? సుఖమున నుండవదేమి?

రాగం: బలహంస
తాళం: ఆది

పల్లవి:
ఇక గావలసిన దేమి మనసా? సుఖమున నుండవదేమి? ॥ఇక॥


అను పల్లవి:
అఖిలాండ కోటి బ్రహ్మాండనాథుఁ
డంతరంగమున నెలకొని యుండగ ॥నిక॥


చరణము(లు)
ముందటి జన్మములను జేసిన యఘ
బృంద విపినముల కా
నంద కందుఁడైన సీతాపతి
నందకాయుధుడై యుండగ ॥నిక॥


కామాది లోభ మోహ మద
స్తోమ తమమ్ములకును
సోమ సూర్య నేత్రుడైన శ్రీ
రామచంద్రుఁడే నీ యందుండగ ॥నిక॥


క్షేమాది శుభములను త్యాగరాజ
కామితార్థములను
నీమమున నిచ్చే దయానిధి
రామభద్రుఁడే నీయం దుండగ ॥నిక

0 Comments:

Post a Comment

<< Home