Tuesday, April 26, 2005

కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు

రాగం: తోడి
తాళం: ఆది
పల్లవి:


కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు
పెద్దల మాటాలు నే డబద్ధ మౌనో ॥క॥


అను పల్లవి:
అద్దంపుఁ జెక్కిళ్లచే
ముద్దుగారు మోముఁ జూడ
బుద్ధి గలిగినట్టి

మానద్ద రావదేమిరా ॥క॥

చరణము(లు)
నిద్దుర నిరాకరించి ముద్దుగాఁ దంబురఁబట్టి
శుద్ధమైన మనసుచే సుస్వరముతోఁ
బద్దు తప్పక భజియించే భక్తపాలనముసేయు
తద్దయశాలివి నీవే త్యాగరాజ సన్నుత ॥క॥

Sunday, April 24, 2005

కదలే వాఁడుగాడే రాముడు - కథలెన్నోగలవాఁడె

రాగం: నారాయణగౌళ
తాళం: ఆది

పల్లవి:
కదలే వాఁడుగాడే రాముడు - కథలెన్నోగలవాఁడె ॥క॥

అను పల్లవి:
మొదలే తానైనాఁడే - తుదిమొదలే లేనివాఁడైనాడే ॥క॥

చరణము(లు)
కల్పన లెన్నడులేఁడు సం - కల్పములే గలవాఁడు శేష
తల్పశయనుఁడే వాఁడు శ్రీ - త్యాగరాజనుతుఁడై నాఁడే ॥క॥