రాగం: కేదారగౌళ
తాళం: చాపు
పల్లవి:
కరుణాజలధే, దాశరథే, కమనీయ సుగుణ నిధే ||కరుణా||
అను పల్లవి:
తరుణాంబుజ నిభ చరణా!
సురమదహరణా! శ్రితజన శరణాద్భుతఘన! ||కరుణా||
చరణము(లు):
మనవిని వినక యోచన జేసిన నే
విననయ్య శ్రీరామ! ఓ పరమ పా
వన! తారక నామ! సుగుణధామ!
జనకతనయావన! చతుర్ముఖ
జనక! జనక వచన సుపరి పా
లనము జేసిన వనజలోచన!
సనకసుత! మా ధనము నీవే ||కరుణా||
సురముని వరనుత! సరసముతో నన్ను
కరుణించిన నీదు తండ్రి సొమ్ము
వెరవక బోనేరదు ఎందుకు వాదు?
హరిగణాధిప పరిచ! రాగమ
చర! పరాత్పర! తరముగాదిక
చరణ భక్తి వితరణ మొసగను
తరుణమిది, శ్రీకర! ధరాధిప! ||కరుణా||
ధనమదమున నుండు మనుజుల నేను యా
చన సేయగ లేనురా త్యాగరాజ
వినుత! ఘృణాసాగర! సమీర
తనయ సేవిత! ధనదనుత! స
జ్జన మనోహర! ఘనరవ స్వర!
మనసు చాలా వినదురా యీ
తనువు నీదని వినుతి జేసెద ||కరుణా||