Monday, January 24, 2005

ఈ వసుధ నీవంటి దైవము నెందు గానరా

రాగం: శహాన
తాళం: ఆది


పల్లవి:
ఈ వసుధ నీవంటి దైవము నెందు గానరా ॥ఈ॥


అను పల్లవి:
భావుకము గల్గి వర్ధిల్లు కోవూరి సుందరేశ గిరీశ ॥ఈ॥


చరణము(లు)
ఆసచే యనిమిషము నీ పుర వాసమొనరఁ జేయువారి మది
వేసటలెల్లను దొలగించి ధన రాసుల నాయువును
భూసురభక్తియు తేజము నొసఁగి భువనమందుఁగీర్తి గల్గఁజేసి
దాసవరద త్యాగరాజ హృదయ నివాస చిద్విలాస సుందరేశ ॥ఈ॥