Monday, January 24, 2005

ఊరకయే కల్గునా రాముని భక్తి

రాగం: శహాన
తాళం: చాపు


పల్లవి:
ఊరకయే కల్గునా రాముని భక్తి ॥ఊరక॥


అను పల్లవి:
సారెకును సంసారమున జొచ్చి
సారమని యెంచు వారి మనసున ॥నూరక॥


చరణము(లు)
ఆలు సుతులు జుట్టాలు వరసద

నాలు గాయ ఫలాలు కనక ధ
నాలు గల విభవాలఁగని యస్థి
రాలను భాగ్య శాలులకుఁ గాక ॥యూరక॥


మంచి వారిని బొడగాంచి సంతతము సే
వించి మనవి నాలకించి యాదరి సా
ధించి సర్వము హరియంచుఁ దెలిసి భా
వించి మదిని పూజించు వారికి గాక ॥యూరక॥


రాజసగుణ యుక్త పూజల నొనరించ
గజ సన్నుత! త్యాగరాజుని జిహ్వపై
రాజిల్లు వర మంత్ర రాజమును స

దా జపించు మహారాజులకు గాక! ॥యూరక॥

0 Comments:

Post a Comment

<< Home